Tripura: అటు నుంచి ఒక బులెట్ వస్తే పాక్ పై బులెట్ల వర్షం కురిపించండి!: ఆర్మీకి చెప్పానన్న రాజ్ నాథ్ సింగ్

  • త్రిపుర ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి
  • పాక్ తో శాంతి పూర్వకంగా ఉంటున్నాం
  • తొలి దాడికి దిగేది లేదు
  • ఒక్క బులెట్ వచ్చినా, లెక్క చూడకుండా కాల్చండి
  • సైన్యాన్ని ఆదేశించానన్న రాజ్ నాథ్

తాము పాకిస్థాన్ తో శాంతిపూర్వకంగానే ఉంటున్నప్పటికీ, ఆ దేశం మాత్రం అందుకు సిద్ధంగా లేదని వ్యాఖ్యానించిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సరిహద్దులకు ఆవలి నుంచి ఒక్క బులెట్ వచ్చినా, లెక్కలేనన్ని బులెట్ల వర్గాన్ని కురిపించాలని సైన్యానికి ఆయన సలహా ఇచ్చినట్టు తెలిపారు. త్రిపురలోని అగర్తలాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, ఓ పొరుగు దేశంగా, పాకిస్థాన్ పై తొలి దాడికి తాము దిగబోమని స్పష్టం చేసిన ఆయన, శాంతినే తాము కోరుకుంటున్నామని, అయితే దురదృష్టవశాత్తూ, పాకిస్థాన్ దాడులను కొనసాగిస్తోందని వెల్లడించారు.

 గడచిన పాతికేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు, ప్రజలను ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేయలేక పోయారని, పేదరికాన్ని నిర్మూలించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలంటే బీజేపీని గెలిపించాలని కోరారు. పశ్చిమ బెంగాల్ లో 35 ఏళ్ల పాటు రాజ్యమేలిన వామపక్షాలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని, ఫిబ్రవరి 18 తరువాత వారికి మరోసారి త్రిపురలో అవకాశం ఇస్తే భవిష్యత్తు నాశనమైనట్టేనని అన్నారు. బీజేపీ ప్రస్తుతం ఇండియాలో 19 రాష్ట్రాలను పాలిస్తోందని గుర్తు చేసిన ఆయన, ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.

More Telugu News