Virat Kohli: నాలుగో స్ధానానికి రహానే బలమైన ఆటగాడవుతాడు: కోహ్లీ

  • రహానేను మూడో ఓపెనర్ గా పేర్కొన్నాను
  •  సఫారీ పిచ్ లపై నాలుగో స్ధానంలో రహానే సరైన ప్రత్యామ్నాయం
  • 5,6 స్థానాలకు బ్యాట్స్ మన్స్ నుంచి మంచి పోటీ

అజింక్యా రహానెను మూడో ఓపెనర్‌ గా పరిగణిస్తున్నామని టెస్టు సిరీస్ కు ముందు చెప్పానని కోహ్లీ గుర్తుచేశాడు. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ డర్బన్ లోని కింగ్స్ మీడ్ వేదికగా ఆరంభం కానున్న నేపథ్యంలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ, వన్డే సిరీస్ కు సన్నద్ధమయ్యామని తెలిపాడు. గత వరల్డ్ కప్ లో రహానే నాలుగో నెంబర్ లో బ్యాటింగ్ కు వచ్చి విలువైన పరుగులు సాధించాడని గుర్తు చేశాడు.

సౌతాఫ్రికాలో పిచ్ పేస్ కు అనుకూలిస్తున్న నేపథ్యంలో కఠినమైన పేస్ బౌలింగ్ కు రహానే సరైన ప్రత్యామ్నాయమని పేర్కొన్నాడు. దీంతో రహానేను నాలుగో నెంబర్ బ్యాట్స్ మన్ గా పంపించే అవకాశం ఉందని తెలిపాడు. ఇక మిడిలార్డర్ లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌, కేదార్ జాదవ్‌, హార్డిక్ పాండ్య, కీపర్ గా ధోనీలలో ఇద్దరికి విశ్రాంతి లభించనుందని చెప్పాడు.

పేసర్లుగా భువీ, బుమ్రా, షమీ, ఉమేశ్ పై విశ్వాసం వ్యక్తం చేశాడు. పిచ్ స్వభావాన్ని బట్టి ఒక్క స్పిన్నర్ నే తీసుకుంటున్నట్టు తెలిపాడు. విజయం సాధించేందుకు ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకుంటామని కోహ్లీ తెలిపాడు. విజయమే లక్ష్యంగా బరిలో దిగుతున్నామని తెలిపాడు. కాగా, డర్బన్ పిచ్ పై టీమిండియా ఒక్క వన్డేలో కూడా విజయం సాదించిన దాఖలాలు లేవు. 

More Telugu News