Allu Arjun: అల్లు అర్జున్‌ కొత్త సినిమా ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలుసా?

  • బన్ని సినిమాల డబ్బింగ్‌ వెర్షన్ చిత్రాలకు విశేష స్పందన
  • మొత్తం ఏడు భాషల్లో బన్ని ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’
  • తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో విడుదల

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ నటిస్తోన్న ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రాన్ని మొత్తం ఏడు భాషల్లో విడుదల చేయడానికి ఆ సినీ యూనిట్ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు తమిళంలోనూ ఆయన సినిమాలకు విశేష స్పందన వస్తుంది.

ఆయన నటిస్తోన్న సినిమాల డబ్బింగ్‌ వెర్షన్ చిత్రాలకు విశేష స్పందన వస్తుండడంతో ఈ సారి ‘నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా’ను నేరుగా ఆ రెండు భాషల్లోనే కాకుండా హిందీ, బెంగాలీ, మరాఠీ, భోజ్‌పురి భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో బన్ని సరసన అను ఇమ్మాన్యుయేల్ నాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.   

More Telugu News