Shriya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అమాయకురాలి పాత్రలో శ్రియా 
  • తనయుడి పాట పాడిన ఇళయరాజా!
  • గౌతమ్ మీనన్ తో అజిత్ ప్రాజక్ట్ 
  • 'కాంచన 3' రెడీ అవుతోంది

*  చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడిపేసే అమాయకురాలి పాత్రలో అందాల శ్రియా నటించనుంది. నూతన దర్శకురాలు సుజన దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో కథానాయికగా శ్రియా ఇలా అమాయకురాలి పాత్రను పోషిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మార్చ్ నుంచి జరుగుతుంది .
*  తనయుడు యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఓ పాట పాడారు. ధనుశ్, సాయిపల్లవి జంటగా రూపొందుతున్న 'మారి 2'  చిత్రం కోసం ఇళయరాజా ఈ పాటను పాడగా నిన్న రికార్డు చేశారు.
*  ప్రముఖ తమిళ కథానాయకుడు అజిత్, దర్శకుడు గౌతమ్ మీనన్ కాంబినేషన్లో మరో చిత్రం రానుంది. ఇందుకు సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆమధ్య వీరిద్దరూ కలసి 'ఎన్నై అరిందాల్' (తెలుగులో 'ఎంతవాడు గాని') చిత్రానికి పనిచేశారు.
*  గతంలో లారెన్స్ తాను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన 'కాంచన' సీరీస్ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. హారర్ చిత్రాలలో ఇవి కొత్త ఒరవడిని సృష్టించాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం మూడో సీక్వెల్ రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నయ్ లో జరుగుతోంది.        

More Telugu News