Balakrishna: 'అగ్గిపెట్టి ఆటలోకి దింపకే' అంటున్న బాలకృష్ణ... వైరల్ అవుతున్న వీడియో!

  • బాలయ్య 102వ చిత్రం 'జై సింహా'
  • పాట ప్రోమో విడుదల
  • 12న విడుదల కానున్న చిత్రం

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా' విడుదలకు సిద్ధమైన వేళ, ఆ చిత్రంలోని ఓ పాటను ఆన్ లైన్ ద్వారా విడుదల చేశారు. "అమ్మకుట్టి అమ్మకుట్టి అందమంతా ఒంపకే... అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే" అంటున్న పాట ఇప్పడు వైరల్ అవుతోంది. మరో పది రోజుల్లో వెండి తెరలను తాకనున్న ఈ చిత్రంలో నయనతార, జగపతిబాబు తదితరులు నటిస్తుండగా, కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా చిత్రం విడుదల కానుంది. వైరల్ అవుతున్న పాట ప్రోమో వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News