tamilanadu: తమిళ హీరో విక్రమ్‌ తండ్రి, సీనియర్ నటుడు వినోద్ రాజ్ మృతి!

  • చెన్నైలో  వినోద్ రాజ్ (80) మృతి
  • టీవీ నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించిన వినోద్ రాజ్
  • ఆయన మృతిపై పలువురు ప్రముఖుల సంతాపం

ప్రముఖ తమిళ హీరో విక్రమ్ తండ్రి, సీనియర్ నటుడు వినోద్ రాజ్ (80) కన్నుమూశారు. చెన్నైలో ఈరోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె సంబంధిత వ్యాధితో వినోద్ రాజ్ మృతి చెందినట్టు సమాచారం. ఆయన మృతిపై సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

కాగా, వినోద్ రాజ్ టెలివిజన్ నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించారు. 1988లో దూరదర్శన్ లో వచ్చిన ‘గలాటా కుదుంబం’ సిరీస్ లో నటించారు. ఆ తర్వాత రెండేళ్లకు ఎన్ కాదల్ కన్మణి చిత్రం ద్వారా సినీ రంగం ప్రవేశం చేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో మంచి పాత్రల కోసం ఆయన ప్రయత్నించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన పనిచేశారు.

1999లో బాల దర్శకత్వంలో వచ్చిన ‘సేతు’ చిత్రం ద్వారా ఆయన విజయవంతమయ్యారు. ‘గిల్లి’, ‘తిరుపచ్చి’ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వినోద్ రాజ్ అసలు పేరు జాన్ విక్టర్. ఆయనకు ఇధ్దరు కుమారులు, ఒక కూతురు. రెండో కుమారుడు అరవింద్ దుబాయ్ లో స్థిరపడ్డారు. కూతురు అనిత టీచర్ గా పనిచేస్తున్నారు. వినోద్ రాజ్ అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.

More Telugu News