Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • మరో బాలీవుడ్ సినిమాలో తమన్నా 
  • తమిళంలో 'అనిరుద్' గా మహేశ్!  
  • తెలుగు సినిమాలో సన్నీ లియోన్ 
  • ఆది, తాప్సీ జంటగా కోన వెంకట్ ప్రాజక్ట్

*  తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా వున్న కథానాయిక తమన్నా తాజాగా ఓ హిందీ చిత్రాన్ని అంగీకరించింది. తమిళంలో వచ్చిన 'జిగర్తాండ' చిత్రానికి రీమేక్ గా నిర్మితమయ్యే ఈ హిందీ చిత్రంలో తమన్నా, ఫర్హాన్ అక్తర్ జంటగా నటిస్తారు. నిశికాంత్ కామత్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తాడు.  
*  ఇటీవలి కాలంలో మహేశ్ బాబుకి తమిళంలో కూడా మార్కెట్ పెరగడంతో గతంలో తెలుగులో వచ్చిన ఆయన చిత్రాలను అక్కడికి డబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేశ్ నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రాన్ని 'అనిరుద్' పేరిట అనువదిస్తున్నారు. తెలుగులో అపజయం పాలైన ఈ చిత్రం తమిళులకు నచ్చుతుందేమో చూడాలి.  
*  బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ తాజాగా ఓ తెలుగు చిత్రంలో కథానాయికగా నటించడానికి సంతకం చేసింది. వీసీ వడివుడియన్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో నవదీప్, నాజర్ లు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తారు. చారిత్రక యుద్ధ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతుంది.
*  ఆది పినిశెట్టి హీరోగా ప్రముఖ రచయిత కోన వెంకట్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో తాప్సీ కథానాయికగా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ హైదరాబాదు, విశాఖ, విజయవాడ నగరాల నేపథ్యంలో సాగుతుంది. హరి దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 21న మొదలవుతుంది.

More Telugu News