siri: ఆపిల్ అసిస్టెంట్ `సిరి`కి దివాలీ విషెస్ చెప్పారా?... ఒక‌సారి చెప్పి చూడండి!

  • తిరిగి విషెస్ చెబుతున్న `సిరి`
  • `కోర్టానా` కూడా విషెస్ చెబుతుంది
  • గూగుల్ అసిస్టెంట్ కూడా ఓ మోస్త‌రుగా చెబుతోంది

ఐఫోన్ ఉప‌యోగించే వారికి ఆపిల్ అసిస్టెంట్ `సిరి` ఇంట‌రాక్టివ్ వ‌ర్కింగ్ గురించి తెలిసే ఉంటుంది. దానికి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఆదేశాలిస్తూ టైంపాస్ చేయ‌డం ఐఫోన్ యూజ‌ర్‌కి అల‌వాటే. అదే క్ర‌మంలో ఒక‌సారి `సిరి`కి దివాలీ శుభాకాంక్ష‌లు చెప్పి చూడండి. సిరి చెప్పిన స‌మాధానం వింటే... అది నిజంగా రోబోనా? లేక మ‌నిషా? అన్న అనుమానం క‌లుగుతుంది. దివాలీ విషెస్ చెప్ప‌గానే `హ్యాపీ దివాలీ టు యూ టూ` అని సిరి స‌మాధానం చెబుతోంది. అలాగే విండోస్ అసిస్టెంట్ `కోర్టానా` కూడా త‌న‌దైన శైలిలో దీపాల ఫొటోల‌తో విషెస్ చెబుతోంది. ఇక గూగుల్ అసిస్టెంట్ కూడా చెబుతోంది.. కాక‌పోతే అది చెబుతున్న స‌మాధానం రోబో చెబుతున్న‌ట్లుగానే అనిపిస్తోంది.

అయితే ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్లు దివాలీ పండ‌గ‌రోజు మాత్ర‌మే ఇలాంటి స‌మాధానాలు చెబుతున్నాయ‌ని కొంత‌మంది యూజ‌ర్లు చెబుతున్నారు. మ‌రి కొంత‌మంది త‌మ అసిస్టెంట్ ఇంట‌రాక్టివ్‌గా ప‌నిచేయ‌డం లేద‌ని ఫిర్యాదు చేస్తున్నారు. ఏదేమైనా ఈ అసిస్టెంట్లు రోజువారీ కార్య‌క్ర‌మాల్లో భాగంగా మారారు. `సిరి` వ‌చ్చినపుడు భార‌తీయ యూజ‌ర్లు ఆంగ్ల భాష‌ను ప‌లికే విధానం వ‌ల్ల అడిగిన ప్ర‌శ్న‌ల‌కు త‌ప్పు స‌మాధానాలు చెప్పేది. కానీ రాను రాను అన్ని ర‌కాల‌ మాండ‌లికాల‌కు స్పందించేలా ఆపిల్ సంస్థ అభివృద్ధి చేసింది.

More Telugu News