sunny leone: హైదరాబాదీల మతి పోగొట్టేందుకు సిద్ధమవుతున్న సన్నీలియోన్

  • 'గరుడ వేగ' ఆడియో రిలీజ్ ఫంక్షన్ కు సన్నీ
  • ఓ సాంగ్ కు డాన్స్ చేయనున్న బాలీవుడ్ భామ
  • 27న జరగనున్న ఆడియో ఫంక్షన్

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ హైదరాబాదులో సందడి చేసేందుకు రెడీ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే, రాజశేఖర్ హీరోగా 'గరుడ వేగ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐటెం సాంగ్ తో ప్రేక్షకుల మతి పోగొట్టేందుకు సన్నీ సిద్ధమవుతోంది. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 27న హైదరాబాదులో జరపాలని సినిమా యూనిట్ భావిస్తోంది.

ఈ కార్యక్రమానికి సన్నీ లియోన్ కూడా హాజరు కానుంది. అంతేకాదు, ఓ సాంగ్ కు డాన్స్ కూడా చేయనుంది. ఇదిలా ఉంచితే, కొన్ని రోజుల క్రితం కేరళలోని ఓ షోరూం ఓపెనింగ్ కు సన్నీ వెళ్లింది. ఆ సందర్భంగా ఆమెను చూసేందుకు జనాలు భారీ ఎత్తున తరలి వచ్చారు. రోడ్లు జామ్ అయిపోయాయి.

More Telugu News