modi: సైనిక పాలన వుంటే దేశానికి మంచిది... భారతీయుల మనోగతం: సంచలన విషయాలను వెల్లడించిన ప్యూ అధ్యయనం

  • సైనిక పాలన కోరుతున్న 53 శాతం మంది
  • ప్రభుత్వంపై నమ్మకముందని అంటూనే...
  • నిరంకుశత్వంవైపు ఇండియా వెళుతోందన్న 55 శాతం
  • ప్యూ రీసెర్చ్ సర్వే వివరాలు

ఇండియాలో 80 శాతం మంది ప్రజలు ప్రభుత్వంపై నమ్మకాన్ని చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్న వేళ, 'ప్యూ రీసెర్చ్' సర్వే సంచలన విషయాలను వెల్లడించింది. పలు దేశాల్లోని ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ప్యూ రీసెర్చ్ ఈ సర్వేను చేసి, దాని ఫలితాలను వెల్లడించింది. గడచిన ఏడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న భారత్ లో 55 శాతం మంది ప్రజలు నిరంకుశత్వం, సైనిక పాలన వుంటే బాగుంటుందని అభిప్రాయపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

అలాగే, ఈ అధ్యయనంలో భాగమైన వారిలో 27 శాతం మంది తమకు మరింత బలమైన నేత కావాలని పేర్కొన్నారు. 2012 నుంచి సగటున 6.9 శాతం వృద్ధి రేటుతో దూసుకెళుతున్న ఇండియాలో ప్రజలు సైనిక పాలన ఉంటే బాగుండునని కోరుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది.

ఇక అంతర్జాతీయంగా చూస్తే, 26 శాతం మంది ప్రజలు బలమైన నేతలు తమ తమ దేశాలను పాలిస్తుంటే బాగుంటుందని, వారి పాలనలో పార్లమెంటు గానీ, కోర్టులు కానీ జోక్యం చేసుకోకూడదని అభిప్రాయపడ్డారు. తమ దేశంలో పాలన సక్రమంగా లేదని సర్వేలో పాల్గొన్న వారిలో 71 శాతం మంది పేర్కొన్నారు. టెక్నాలజీకి మద్దతిస్తున్న దేశాల్లో ఇండియా టాప్-3లో నిలిచింది. ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని 57 శాతం మంది వ్యతిరేకించారు.

ఇండియాలో మిలటరీ పాలన కావాలని 53 శాతం మంది, ఆఫ్రికాలో మిలటరీ పాలన కావాలని 52 శాతం మంది కోరుకున్నారు. ఈ రెండు దేశాల్లోని 50 సంవత్సరాలు పైబడిన ప్రజలు మాత్రం సైనిక పాలన కావాలని కోరుకోవడం లేదు. యూరప్ దేశాల్లో పది మందిలో ఒకరు మాత్రమే మిలటరీ రూల్ ను కోరుకుంటున్నారని ప్యూ రీసెర్చ్ వెల్లడించింది. మొత్తం 38 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించామని పేర్కొంది.

More Telugu News