kajal agarwal: కాజ‌ల్‌, త‌మ‌న్నా... ఓ వాట్సాప్ గ్రూప్‌!

  • గ్రూప్‌లో మ‌రో ఇద్ద‌రు న‌టీమ‌ణులు
  • గ్రూప్ క్రియేట్ చేసిన `క్వీన్‌` బృందం
  • నాలుగు భాష‌ల్లో `క్వీన్‌` రీమేక్‌

ఈ మ‌ధ్య ప్ర‌తి చిన్న విష‌యానికి వాట్సాప్ గ్రూప్ సృష్టించ‌డం అల‌వాటుగా మారింది. సినిమా వాళ్లు కూడా ఇందుకు తీసిపోలేదు. త‌మ సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను మిగ‌తా యూనిట్‌తో షేర్ చేసుకోవ‌డానికి వాట్సాప్ గ్రూప్‌లు క్రియేట్ చేసుకుంటున్నారు. అదే బాటలో కాజ‌ల్‌, త‌మ‌న్నాలు కూడా ఓ వాట్సాప్ గ్రూప్‌లో స‌భ్యుల‌య్యారు. వారిద్ద‌రూ క‌లిసి ఏ సినిమాలో న‌టిస్తున్నార‌ని ఆశ్చ‌ర్య పోకండి. వారిద్ద‌రూ ఒకే సినిమాలో న‌టిస్తున్నారు కానీ వేర్వేరు భాషల్లో... హిందీ సినిమా `క్వీన్‌` తెలుగు రీమేక్ `క్వీన్‌` లో త‌మ‌న్నా, త‌మిళ రీమేక్ `పారిస్ పారిస్‌`లో కాజ‌ల్ న‌టిస్తున్నారు.

ఈ గ్రూప్‌లో క‌న్న‌డ రీమేక్ `బ‌ట‌ర్‌ఫ్లై`లో న‌టిస్తున్న పారుల్ యాద‌వ్‌, మ‌ల‌యాళ రీమేక్ `జామ్ జామ్‌`లో న‌టిస్తున్న మంజిమా మోహ‌న్‌లు కూడా స‌భ్యులుగా ఉన్నారు. నాలుగు భాష‌ల్లో ఒకేసారి షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ సినిమా వివ‌రాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు పంచుకోవ‌డానికి చిత్ర యూనిట్ ఈ వాట్సాప్ గ్రూప్‌ను సృష్టించింది. ఈ గ్రూప్‌లో చిత్రానికి ప‌నిచేస్తున్న ఇత‌ర స‌భ్యులు కూడా ఉన్నార‌ట‌.

More Telugu News