dhoni captaincy: కోహ్లీ కెప్టెనే....కానీ నడిపిస్తున్నది ధోనీయే!

  • కెప్టెన్ కోహ్లీ అయినప్పటికీ యాక్టివ్ కెప్టెన్ ధోనీయే
  • విజయాల్లో ధోనీ పాత్ర కీలకం
  • తొలి వన్డేలో ధోనీ సంభాషణలు వికెట్లలోని కెమెరాలలో రికార్డు
  • ధోనీ సలహాలతో వికెట్లు తీసిన చాహల్, కుల్దీప్ యాదవ్
  • బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన ధోనీ
  • సోషల్ మీడియాలో ధోనీ వ్యాఖ్యలు వైరల్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్న సంగతి తెలిసిందే. కానీ విజయ సారధి మాత్రం ధోనీయేనని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుదీర్ఘ కాలం టీమిండియా కెప్టెన్ గా పని చేసిన ధోనీకి ప్రణాళికలు రచించడం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, క్షణాల్లో అమలు చేయడం అలవాటు. దీంతోనే టీమిండియాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత పెద్దగా ప్రభావం చూపని ధోనీ, ఈ మధ్య కాలంలో బ్యాటింగ్, కీపింగ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు.

ఈ క్రమంలో విజయాల బాటలో నడుస్తున్న టీమిండియాకు వన్డే ఫార్మాట్ లో కీలకమైన సలహాలిస్తూ ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఆసీస్ తో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్లకు కీలక సమయాల్లో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి బౌలర్లకు ఉపయోగపడ్డాడు. బ్యాటింగ్ లో విశేషంగా రాణించి విజయం అందించాడు. ఈ నేపధ్యంలో కీపింగ్ చేస్తున్న సందర్భంగా ఛాహల్, కుల్ దీప్ యాదవ్ తో చేసిన సంభాషణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ధోనీ వ్యూహాలే జట్టుకు విజయాలు అందిస్తున్నాయని నెటిజన్లు పేర్కొంటున్నారు. 

More Telugu News