chiranjeevi: 'సైరా' రెగ్యులర్ షూటింగుకి ముహూర్తం ఖరారు

  •  అక్టోబర్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  •  నానక్ రామ్ గూడా స్టూడియోలో భారీ సెట్
  •  పాత్రకి తగిన లుక్ తో సిద్ధమైన చిరూ
  •  మెగాస్టార్ అభిమానుల్లో పెరుగుతోన్న ఆసక్తి  


       

'సైరా నరసింహా రెడ్డి' సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయం కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 20 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

 హైదరాబాద్ - నానక్ రామ్ గూడాలో ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమాలో కనిపించే లుక్ తో చిరంజీవి సిద్ధంగా వున్నారు. ఈ సినిమాలో కథానాయికగా నయనతారను ఎంపిక చేసుకోగా, తమిళ .. కన్నడ .. హిందీ భాషలకి చెందిన నటీనటులను కూడా తీసుకున్నారు. చారిత్రక నేపథ్యంతో కూడిన ఈ సినిమా, చిరంజీవి స్థాయిని మరింతగా పెంచేదిలా ఉండాలనే ఉద్దేశంతో, దర్శకుడు సురేందర్ రెడ్డి .. చరణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.     

More Telugu News