: తలాక్ రద్దు తీర్పులో స్పష్టతలేదని సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదనలు.. తోసిపుచ్చిన సీజే!

మూడుసార్లు త‌లాక్ చెప్పి భార్య‌కు విడాకులు ఇచ్చే ప‌ద్ధ‌తి రాజ్యాంగ‌, చ‌ట్ట విరుద్ధ‌మ‌ని ఆ విధానాన్ని రద్దు చేస్తున్నామ‌ని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పు కాపీలో స్పష్టత కొరవడిందంటూ సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్ ఈ రోజు సుప్రీంకోర్టులో వాదించారు. ఇందుకు సంబంధించి ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తరపున ఆయన సుప్రీంకోర్టులో వాద‌న‌లు వినిపించారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన‌ తీర్పు కాపీలోని చివరి పేజీ ప్రతిని సమర్పించి తీర్పుపై స్ఫష్టత ఇవ్వాల‌ని అడిగారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి ఖేహర్‌... తాము ఇచ్చిన తీర్పు స్ప‌ష్టంగానే ఉంద‌ని చెప్పారు. ఒకవేళ దీనిపై మరింత వివరణ కావాలంటే ద‌రఖాస్తు చేసుకొని తెలుసుకోవ‌చ్చ‌ని సూచించారు.

More Telugu News