ajith: కూతురుతో కలిసి 'వివేగం' చూసిన కమల్!

కమలహాసన్ చిన్న కూతురు అక్షర హాసన్ నటించిన 'వివేగం' ఈ రోజునే ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాతో తమిళ చిత్రపరిశ్రమకి ఆమె పరిచయమైంది. ఇదే సినిమా 'వివేకం' పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడంతో, తెలుగులోను ఆమె ఈ సినిమా ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 అజిత్ .. కాజల్ జంటగా నటించిన ఈ సినిమాలో అక్షర హాసన్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించింది. ఈ సినిమాలో ఆమె నటన ఎలా వుందో చూడాలనే ఆసక్తితో, ఈ రోజు ఉదయాన్నే కూతురును వెంటబెట్టుకుని కమల్ తొలి ఆటకు వెళ్లారు. ఈ సినిమా చూసి వచ్చిన తరువాత ఆయన ఈ విషయాన్ని గురించి ట్వీట్ చేశారు. కూతురు అక్షర హాసన్ ను మెచ్చుకుని ఆమెను ప్రోత్సహించినట్టు, ఈ సినిమా టీమ్ లోని వాళ్లందరికీ అభినందనలు తెలియజేసినట్టు సమాచారం.     

More Telugu News