sharvanad: విదేశాలకి వెళుతోన్న 'మహానుభావుడు'

శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో 'మహానుభావుడు' సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ 'పొల్లాచ్చి'లో జరుగుతోంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. అక్కడి షెడ్యూల్ పూర్తికాగానే ఇటలీ .. ఆస్ట్రియా .. క్రొటియా తదితర దేశాల్లో ఈ సినిమా షూటింగును ప్లాన్ చేశారు. ఆ దేశాల్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు పాటలను కూడా తెరకెక్కించనున్నారు.

 యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు మారుతి 'భలే భలే మగాడివోయ్'లో హీరో మతిమరుపుతో బాధపడేవాడిగా చూపించి నవ్వులు పూయించాడు. అలాగే ఈ సినిమాలో హీరో అతిశుభ్రతతో బాధపడే చాదస్తపు మనిషిగా చూపిస్తూ పూర్తి స్థాయిలో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయనున్నాడు. దసరాకి గట్టిపోటీ ఉన్నప్పటికీ, ఆ సమయంలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.    

More Telugu News