lawrence: భయపెట్టేందుకు లారెన్స్ మళ్లీ వచ్చేస్తున్నాడు!

నృత్య దర్శకుడిగా .. నటుడిగా .. దర్శకుడిగా లారెన్స్ తన సత్తా చాటుకున్నాడు. 'ముని' సినిమా .. ఆ మూవీ సీక్వెల్స్ గా ఆయన తెరకెక్కించిన హారర్ సినిమాలు తమిళంలోను .. తెలుగులోను కాసుల వర్షం కురిపించాయి. ఈ సినిమాల్లో నటుడిగాను లారెన్స్ తన విశ్వరూపం చూపించాడు.

 రెండేళ్లుగా దర్శకత్వం జోలికి వెళ్లని లారెన్స్ .. 'ముని' సిరీస్ లో భాగంగా మరో సినిమాకి రంగాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమా కథపై కసరత్తు జరుగుతోందని అన్నాడు. గతంలో వచ్చిన తన సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పాడు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తానని అన్నాడు. లారెన్స్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ నటించే ఈ సినిమాలో, కథానాయికగా కాజల్ పేరు వినిపిస్తోంది.      

More Telugu News