tupaki: మహేశ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టేస్తున్న విషయం అదేనట!

సంగీత దర్శకులలో హ్యారీస్ జైరాజ్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఆయన బాణీలను యూత్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంది. తాను చేసిన ఆల్బమ్స్ పై తనదైన ముద్ర ఉండేలా ఆయన చూసుకుంటూ వుంటారు. తమిళంతో పాటు కొన్ని తెలుగు సినిమాలకి కూడా ఆయన సంగీతాన్ని అందించారు. ఆ జాబితాలో వాసు .. మున్నా .. సైనికుడు .. ఆరెంజ్ వంటి చిత్రాలు కనిపిస్తాయి.

పాటల విషయం పక్కన పెడితే .. ఆ సినిమాలేవీ ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాయి. దాంతో సహజంగానే హ్యారీస్ జైరాజ్ కి అవకాశాలు తగ్గిపోయాయి. కానీ 'స్పైడర్' సినిమాతో మురుగదాస్ ఆయనకి ఛాన్స్ ఇచ్చాడు. దాంతో మహేశ్ అభిమానులకు టెన్షన్ పట్టుకుందనే వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది. సినిమాలో విషయం ఉండాలే గానీ .. మ్యూజిక్ డైరెక్టర్ ను సెంటిమెంట్ గా చూపడం కరెక్ట్ కాదనేది మరికొందరి వాదన.   

More Telugu News