: రాజధాని నుంచి 5 లక్షల మందిని తరలిస్తున్నాం: చైనా అధ్యక్షుడు

చైనా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని బీజింగ్ నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల మందిని ఖాళీ చేయించాలని నిర్ణయించింది. వీరి కోసం బీజింగ్ శివార్లలోని జియాంగాన్ న్యూ ఏరియా పేరుతో కొత్త నగరాన్ని నిర్మిస్తోంది. బీజింగ్ లో జనాభా విపరీతంగా పెరగడంతో, ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు పలు కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో, పాలనకు సంబంధం లేని అన్ని సంస్థలను బీజింగ్ నుంచి తరలించాలని నిర్ణయించింది. పలు పారిశ్రామిక సంస్థల ప్రధాన కార్యాలయాలు, యూనివర్శిటీలు, పరిశోధన సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ విషయాన్ని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ స్వయంగా ఓ ప్రకటనలో తెలిపారు. జియాంగాన్ న్యూ ఏరియాలో తొలుత 10 లక్షల మంది ఉంటారని... క్రమంగా ఈ సంఖ్య 50 లక్షలకు చేరుకుంటుందని చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ తన నివేదికలో పేర్కొంది.

More Telugu News