: కేంద్రమా మజాకా?... కేవలం నెల రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పై 4.36 రూపాయల వడ్డన!

పెట్రోల్ ధరలపై రోజువారీ సమీక్ష విధానం వినియోగదారుల జేబులకు చిల్లుపెడుతోంది. రెండు నెలల క్రింద పెట్రోలు బంకుల్లో బులియన్ మార్కెట్ తరహాలో రోజువారీ ధరల సమీక్ష విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆరంభంలో పైసల్లో తగ్గించిన పెట్రోల్ ధరలను కేవలం గత నెల రోజుల్లోనే నాలుగు రూపాయల 36 పైసల వరకు పెంచింది. గతంలో 15 రోజుల కొకసారి పెట్రోల్ ధరల సమీక్ష విధానం అమలులో ఉండేది. దీంతో ప్రతి 15 రోజులకు ధరలు పెరిగినా తగ్గినా స్పష్టంగా తెలిసేది. ఇప్పుడా పరిస్థితి లేదు. నిన్నటి ధరతో నేటి ధరను పోల్చి చూసే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో జూన్‌ 16న చివరిసారిగా పక్షంరోజుల సమీక్ష జరిగినప్పుడు లీటర్ పెట్రోలు ధర 71.57 రూపాయలు ఉండగా, లీటర్ డీజిల్‌ ధర 61.33 రూపాయలుగా ఉంది. అప్పటి నుంచి రోజూ ధరలు మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జులై 1 నాటికి లీటర్ పెట్రోలు ధర 69.09 రూపాయలు ఉంది, లీటర్ డీజిల్‌ ధర 60.32 రూపాయలు ఉంది. ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర 74.70 రూపాయలు ఉంది. లీటర్ డీజిల్ ధర 68.08 రూపాయలు. దీంతో రోజు వారీ ధరల సమీక్ష పేరుతో కేవలం నెల రోజుల్లోనే ఏపీలో లీటర్ పెట్రోలుపై 5.61 రూపాయలు, లీటర్ డీజిల్‌ పై 3.76 రూపాయలు పెంచారు. ఏపీలో వ్యాట్  4 రూపాయలు అదనంగా ఉండడంతో, తెలంగాణలో 1.9 రూపాయలు, డీజిల్ 1.76 రూపాయలు తక్కువగా ఉండడం విశేషం. 

More Telugu News