: అప్పుడు 'ట్రంప్! దూరంగా ఉండు' అని అరవాలనిపించింది: హిల్లరీ క్లింటన్

అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా జరిగిన రెండో బిగ్ డిబేట్ లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తన పక్కన ఉండడం చాలా అసౌకర్యం కలిగించిందని హిల్లరీ క్లింటన్ తెలిపారు. తాజాగా ఆమె 'వాట్ హ్యాపెన్డ్' పేరిట ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకం సెప్టెంబర్ 12న మార్కెట్ లోకి రానుంది. దీనిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, తన ఆలోచనలు, పరిస్థితులను ఆమె వివరించారు. ఈ మేరకు ఒక ఆడియోను ఎంఎస్ఎన్బీసీలో ప్రసారం చేశారు. అందులో గత అక్టోబర్ లో సెయింట్ లూయిస్ లో బిగ్ డిబేట్ ను ఏర్పాటు చేయగా, అంతకు ముందే మహిళలపై ట్రంప్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను విన్నానని ఆమె తెలిపారు.

 బిగ్ డిబేట్ సందర్భంగా ట్రంప్ ఎదురుపడ్డాడని, ఆ పరిస్థితుల్లో ట్రంప్ ను ఫేస్ చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డానని ఆమె అన్నారు. ట్రంప్ తనకు దగ్గరగా తిరుగుతూ మొహంలో మొహం పెట్టి చూస్తుండడంతో తీవ్ర అసహనానికి గురయ్యానని ఆమె చెప్పారు. ఆ దశలో తనకు ఊపిరి కూడా సరిగ్గా అందలేదని, దీంతో దూరంగా ఉండమని ట్రంప్ పై అరవాలని అనిపించిందని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల్లో ఏం జరిగిందన్న పూర్తి వివరాలను ఈ పుస్తకంలో పేర్కొనకపోయినా, కొన్ని ఆసక్తికర అంశాలను మాత్రం ప్రస్తావించారు.  

More Telugu News