: పాకిస్థాన్! ఏం కావాలో నిర్ణయించుకో...!: అమెరికా తీవ్ర హెచ్చరిక

పాకిస్థాన్ కు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ గట్టి హెచ్చరికలు చేశారు. దాని వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా‌ తయారైందని, పాక్ వెంటనే తన వైఖరి మార్చుకుని ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిని పాకిస్థాన్ తోసిపుచ్చింది. దీనిపై పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. అగ్రరాజ్యాధినేత చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా నిరుత్సాహపరిచాయని పేర్కొంది. తీవ్రవాదం కారణంగా ప్రపంచంలో ఏ దేశము కూడా పాకిస్థాన్ కంటే ఎక్కువ నష్టపోవడం లేదని తెలిపింది.

దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు తక్షణం చర్యలు ప్రారంభించని పక్షంలో తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అమెరికాతో పాకిస్థాన్ ఇంతవరకు నాటోయేతర అతిపెద్ద భాగస్వామ్యదేశంగా ఉందని, చర్యలు తీసుకోని పక్షంలో పాకిస్థాన్ ఆ హోదా కోల్పోతుందని హెచ్చరించారు. ఈ హోదాలో భాగంగానే ఉగ్రవాద నిర్మూలన కోసం భారీ ఎత్తున ఆర్థిక, సైనిక సహకారం పాక్ పొందుతోందన్న సంగతి గుర్తుంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు.  

More Telugu News