: ఓబీసీల‌కు శుభ‌వార్త‌... త్వ‌ర‌లో క్రిమిలేయ‌ర్ లిమిట్‌ను రూ. 8 ల‌క్ష‌ల‌కు పెంచేందుకు క‌మిష‌న్ ఏర్పాటు

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఓబీసీ ఉద్యోగార్థులకు శుభ‌వార్త తెలియ‌జేశారు. ప్ర‌స్తుతం రూ.6 లక్షలుగా ఉన్న ఓబీసీ క్రిమిలేయ‌ర్ లిమిట్‌ను రూ.8 లక్షలకు పెంచేందుకు త్వరలో ఓ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ కమిషన్‌కు ఓ ఛైర్మన్‌ను నియమించి, 12 వారాల్లోగా నివేదికను అందజేసేలా చూస్తామని ఆయన తెలిపారు. ఓబీసీలను అత్యంత వెనుకబడిన తరగతులు, మరింత వెనుకబడిన తరగతులు, వెనుకబడిన తరగతులు అనే మూడు వర్గాలుగా విభ‌జించాల‌ని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో సిఫార్సు చేసిన సంగ‌తి తెలిసిందే.

వీటిలో అత్యంత వెనుకబడిన తరగతులను సంచార జాతులు, పాక్షిక సంచార జాతులు, విముక్త జాతి, నామమాత్రపు సంచార జాతులు వంటి ఉప-కేటగిరీలుగా కూడా విభ‌జించాల‌ని తెలిపింది. ఇలా చేయ‌డం వ‌ల్ల ఆయా తరగతుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంద‌ని క‌మిష‌న్ నివేదిక‌లో అభిప్రాయ‌ప‌డింది. వీట‌న్నింటిని కేంద్రం ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని, అమ‌లు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. క్రిమిలేయర్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉపాధి, ఉద్యోగాల్లో వెనుకబడిన తరగతులకు కల్పించిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తారు.

More Telugu News