salman. aishwarya: 'పద్మావతి' విషయంలో ఐశ్వర్య రాయ్ ఆ షరతు పెట్టిందట!

గతంలో సల్మాన్ ఖాన్ .. ఐశ్వర్య రాయ్ ప్రేమ వ్యవహారం, ఆ తరువాత మనస్పర్థల కారణంగా వాళ్లు దూరం కావడం తెలిసిందే. ఆ పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు తీవ్రంగా ఆరోపణలు చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కలిసి నటించలేదు. ఒకప్పుడు వరుస హిట్స్ ఇచ్చిన ఈ జంటను వెండితెరపై మళ్లీ చూడాలనే కోరిక ఎంతోమంది అభిమానులకు వుంది. 'పద్మావతి' సినిమాతో అభిమానుల కోరికను నెరవేర్చాలని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అనుకున్నారు.

 ఈ కారణంపై ఆయన ఐశ్వర్య రాయ్ ను సంప్రదించగా, విలన్ గా అల్లా వుద్దీన్ ఖిల్జీ పాత్రను సల్మాన్ చేస్తే, 'పద్మావతి'గా చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిందట. ఈ విషయం సల్మాన్ దగ్గర ప్రస్తావిస్తే .. ఐశ్వర్య రాయ్ మూవీలో విలన్ గా కనిపించే ప్రసక్తే లేదని ఆయన తేల్చేశాడు. అలా ఈ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో .. దీపికా పదుకొనె - రణవీర్ సింగ్ లకు ఈ ప్రాజెక్టు వెళ్లిందనే టాక్ బాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది.  

More Telugu News