chiranjeevi: పవన్ కి 'సైరా' మోషన్ పోస్టర్ ను ముందుగానే చూపించారట!

చిరంజీవి పుట్టిన రోజు వేడుక నిన్న సందడి సందడిగా జరిగింది. ఆయన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 'సైరా నరసింహారెడ్డి' మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సందడిలో పవన్ కనిపించకపోవడంతో మెగా అభిమానులకి కాస్త నిరాశ కలిగింది. అయితే నాలుగు రోజుల ముందే చిరంజీవిని పవన్ కలిసినట్టుగా తెలుస్తోంది.

హైదరాబాద్ లో 'రంగస్థలం 1985' షూటింగ్ జరుగుతోన్న సెట్ కి పవన్ వెళ్లాడట. చరణ్ తో కాసేపు మాట్లాడిన తరువాత .. ఇద్దరూ కలిసి చిరంజీవి దగ్గరికి వెళ్లారని చెబుతున్నారు. చిరంజీవికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్, 'సైరా' సినిమా విశేషాల గురించి అడిగి తెలుసుకున్నాడని అంటున్నారు. అప్పుడే ఆయనకి చిరంజీవి ఈ సినిమా మోషన్ పోస్టర్ ను చూపించారని చెబుతున్నారు. ఆ పోస్టర్ పట్ల ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేసిన పవన్, తన సినిమా ముచ్చట్లను కూడా అన్నయ్యతో పంచుకున్నాడని అంటున్నారు.    

More Telugu News