: రెండు గంటల్లో 20 శాతం పోలింగ్... బారులు తీరిన యువ ఓటర్లు, తమకే లాభమంటున్న టీడీపీ, వైసీపీ

అధికార టీడీపీ, విపక్ష వైఎస్ఆర్ సీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నంద్యాల ఉప ఎన్నికకు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, ఒకటి రెండు చోట్ల ఈవీఎంల మొరాయింపు మినహా, మరే ఇతర అవాంఛనీయ ఘటనలూ లేకుండా రెండు గంటల పాటు పోలింగ్ సాగింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువ ఓటర్లు బారులు తీరగా, ఓటింగ్ శాతం పెరగవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఈ ఎన్నికల్లో తొలిసారిగా తెలుగు రాష్ట్రాలకు వీవీపాట్ యంత్రాలు పరిచయం అవుతుండగా, తాము ఎవరికి ఓటేశామో చూసుకుంటుంటే ఆనందంగా ఉందని ఓటర్లు వ్యాఖ్యానించారు. ఇక తొలి రెండు గంటల వ్యవధిలోనే 20 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. సుమారు 2.18 లక్షల మంది ఓటర్లు ఉండగా ఇప్పటికే 40 వేల మందికి పైగా తమ ఓట్లను వేశారు. ఇక యువ ఓటర్లు అధికంగా కనిపిస్తుండటం తమకు లాభం కలిగిస్తుందని వైకాపా చెబుతుండగా, తమకే లాభమని టీడీపీ వర్గాలు అంటున్న పరిస్థితి.

More Telugu News