: మేకిన్ ఇండియా: 234 నేవీ హెలికాప్టర్ల కోసం ప్రపంచ వేట.. విలువ 5 బిలియన్ డాలర్లు!

మేకిన్ ఇండియాలో భాగంగా 123 నేవీ హెలికాప్టర్ల తయారీ కోసం ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వేట ప్రారంభించింది. యాంటీ-సబ్‌మెరైన్ వార్ సామర్థ్యం ఉన్న నేవల్ మల్టీ-రోల్ హెలికాప్టర్ల (ఎన్ఎంఆర్‌హెచ్) ను దేశీయంగా తయారు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం ముందుకొచ్చే వారితో వ్యూహాత్మక భాగస్వామ్యం (ఎస్‌పీ) కుదుర్చుకునేందుకు సిద్ధమైంది. మొత్తం 123 ఎన్ఎంఆర్‌హెచ్‌లలో నౌకల డెక్‌లపై నుంచి ఆపరేషన్స్‌లో పాల్గొనే 111 నేవల్ లైట్ యుటిలిటీ చాపర్లు (ఎన్‌యూహెచ్)లు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ 5 బిలియన్ డాలర్లు.

దేశీయంగా రక్షణ ఉత్పత్తుల రంగాన్ని మరింత పటిష్టం చేయడమే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే రూ.70 వేల కోట్లతో ఆరు స్టెల్త్ జలాంతర్గాముల కోసం ఆరు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. కాగా, నేవీలో జీవిత కాలం ముగుస్తున్న సింగిల్ ఇంజిన్ చేతక్ హెలికాప్టర్ల స్థానంలో సరికొత్త ఎన్‌యూహెచ్ హెలికాప్టర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అందులో భాగంగానే దేశీయంగా తయారుచేసే కంపెనీల కోసం ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా వేట ప్రారంభించింది. కాగా, వచ్చే పది పదిహేనేళ్లలో వివిధ రకాల సామర్థ్యం కలిగిన 1200 హెలికాప్టర్లను సమకూర్చుకోవాలని నేవీ లక్ష్యంగా పెట్టుకుంది.

More Telugu News