: ‘అర్జున్ రెడ్డి’కి మద్దతు.. వీహెచ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన రామ్ గోపాల్ వర్మ!

‘అర్జున్ రెడ్డి’ సినిమా పోస్టర్లు అసభ్యంగా ఉన్నాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఓ ఆర్టీసీ బస్సుపై ఉన్న ‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ను ఆ బస్సు కండక్టర్ సాయంతో తొలగించే ప్రయత్నం ఆయన చేయడం విదితమే. దీనిపై స్పందించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా హీరో విజయ్ దేవరకొండ ‘తాతయ్యా...చిల్’ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో ఇటీవల పేర్కొన్నాడు.

ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన దైన శైలిలో ‘అర్జున్ రెడ్డి’కి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. బస్సుపై ఉన్న‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ ను తొలగిస్తున్న వి.హనుమంతరావు ఫొటోను తన ‘ఫేస్ బుక్’ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ .. ‘మీ పార్టీ తాతయ్య అయిపోయింది. ఇప్పుడు, మీ పిల్ల చేష్టల ద్వారా ప్రజలు, మనవళ్లు, మనవరాళ్లు వచ్చే ఎన్నికల్లోనూ ఆ తర్వాత కూడా ఓటు వెయ్యరు. దీంతో, మీరు, మీ పార్టీ డబుల్ తాతయ్య అయిపోతారు. తాతయ్యా..‘అర్జున్ రెడ్డి’ పోస్టర్ లో ఏమైనా తప్పు ఉందేమో మీ మనవళ్లను, మనవరాళ్లను అడగండి? ‘అర్జున్ రెడ్డి’ సినిమా కచ్చితంగా మనవళ్లు, మనవరాళ్ల కోసమే కానీ, పాత ఆలోచనా ధోరణిలో ఉండే తాతయ్యల కోసం కాదు.. జస్ట్ చిల్’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

More Telugu News