vijay devarakonda: విడుదలకి ముందే 'అర్జున్ రెడ్డి' వేడెక్కిస్తున్నాడు!

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన 'అర్జున్ రెడ్డి' సినిమా, ఈ నెల 25వ తేదీన భారీస్థాయిలో విడుదల కాబోతోంది. హీరో హీరోయిన్ల లిప్ లాక్ తో కూడిన పోస్టర్స్ తో భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ పోస్టర్స్ వ్యవహారం రచ్చకు దారితీసింది. సీనియర్ పొలిటీషియన్ వి. హనుమంతరావు ఈ పోస్టర్స్ పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ .. దగ్గరుండి మరీ కొన్నిటిని చింపేశారు.

 ఆయన తీరు పట్ల హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా చాలామంది అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా లిప్ లాక్ పోస్టర్స్  పట్ల మహిళా సంఘాల నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఈ సినిమా దర్శకుడిని పోలీస్ స్టేషన్ కి పిలిపించినట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమా విడుదలకి ముందే నానా రచ్చ చేసేస్తోంది.     

More Telugu News