: బెంగళూరు సరస్సు కాలుష్యంపై గ్రీన్ ట్రైబ్యునల్ సీరియస్!

బెంగళూరులోని బెల్లందూరు సరస్సు విషపు నురగలు కక్కుతున్న ఘటనపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వతంతేర్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సంఘటనపై ఈ రోజు విచారణ జరిపింది. సరస్సు పరిరక్షణ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఈ సరస్సు మళ్లీ విషపు నురగలు కక్కకుండా ఉండేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై పది రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిసర కంపెనీల నుంచి చెరువులో కలుస్తున్న వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించిన ధర్మాసనం, ఈ కేసు తదుపరి విచారణను సెప్టెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.  

More Telugu News