: ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకం: మోదీ

ట్రిపుల్ త‌లాక్ రాజ్యాంగ, చ‌ట్ట విరుద్ధ‌మ‌ని సుప్రీంకోర్టు ఐదుగురు స‌భ్యుల రాజ్యాంగ‌ ధ‌ర్మాస‌నం ఈ రోజు తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. స‌మాన‌త్వ హ‌క్కును ఈ ప‌ద్ధ‌తి అతిక్ర‌మిస్తోంద‌ని అభిప్రాయపడ్డ ధర్మాసనం... తలాక్ చెల్లదని, ఈ ఆదేశాలు ఆరు నెలల పాటు అమలయ్యేలా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. ఈలోగా కేంద్ర‌ ప్ర‌భుత్వం చ‌ట్టం చేయాల‌ని చెప్పింది. ధ‌ర్మాస‌నంలోని ఐదుగురు స‌భ్యుల్లో 3-2 మెజార్టీతో ట్రిపుల్ త‌లాక్‌ను సుప్రీంకోర్టు నిషేధించింది.

ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ కీల‌క తీర్పును ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ స్వాగ‌తించారు. ట్రిపుల్ త‌లాక్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మ‌క‌మ‌ని ఆయ‌న అన్నారు. ఈ తీర్పు ముస్లిం మ‌హిళ‌ల‌కు స‌మాన‌త్వ హ‌క్కును ప్ర‌సాదించింద‌ని పేర్కొన్నారు. మ‌హిళా సాధికార‌తను పెంపొందించే దిశ‌గా ఈ తీర్పు ఉంద‌ని అన్నారు.
 
సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా... ఇది ఎవరి గెలుపు గురించో, ఓటమి గురించో కాదని వ్యాఖ్యానించారు. త‌మ‌ పార్టీ తరఫున ఈ తీర్పును స్వాగతిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

More Telugu News