tapsee: దెయ్యం కంటెంట్ అదరగొట్టేసింది .. రీమేక్ హక్కుల కోసం పోటీ!

తాప్సీ ప్రధాన పాత్రగా 'ఆనందో బ్రహ్మ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, షకలక శంకర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, చాలా తక్కువ బడ్జెట్ తో రూపొందింది. కానీ ఈ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అందుకు కారణం హారర్ ను, కామెడీని కరెక్టుగా కలిపి అందించడమేననే టాక్ వినిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ పట్ల దర్శకుడు మహి వి.రాఘవ్ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తాము ఆశించిన దానికంటే ఎక్కువగా ఈ సినిమా వసూళ్లు రాబడుతోందని అన్నాడు. దక్షిణాదిన ఇతర భాషల వారితో పాటు, హిందీ ఇండస్ట్రీ నుంచి కూడా రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతుండటం గర్వంగా అనిపిస్తోందని చెప్పాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నాడు. ఈ ఏడాది బెస్ట్ హారర్ కామెడీ మూవీగా తమ సినిమా నిలవడం ఖాయమనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.  

More Telugu News