: నాలాలను మనుషులు క్లీనింగ్‌ చేయడంపై నిషేధం విధించిన ఢిల్లీ ప్ర‌భుత్వం

నాలాలు, మ్యాన్‌హోల్స్‌ల‌ను మాన్యువ‌ల్‌గా (మనుషులు) శుభ్రం చేయ‌డంపై నిషేధం విధిస్తున్న‌ట్లు ఢిల్లీ సోష‌ల్ వెల్ఫేర్ మంత్రి రాజేంద్రపాల్ గౌత‌మ్ ప్ర‌క‌టించారు. ఈ నియ‌మాన్ని ఉల్లంఘిస్తే శిక్షార్హమైనదిగా భావించి, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. అలాగే 15 రోజుల్లోగా మ‌నుషుల సాయం లేకుండా మెషీన్ల‌తో గానీ, మ‌రేదైనా ప్ర‌త్యామ్నాయాన్ని గానీ సూచించాల్సిందిగా క‌మిటీని నియ‌మించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ మ‌ధ్య నాలాలు శుభ్రం చేస్తూ కార్మికులు చ‌నిపోతుండ‌టంపై చ‌ర్చించ‌డానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజ‌ల్‌, ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్‌తో స‌మావేశమ‌య్యారు.  ఈ చ‌ర్చ‌ల అనంత‌రం మాన్యువ‌ల్ క్లీనింగ్‌పై నిషేధం విధించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్ర‌చార బోర్డుల‌ను, హెచ్చ‌రిక‌ల‌ను ఢిల్లీ మొత్తం ఏర్పాటు చేశారు.

More Telugu News