mahesh: భారీ ధరకు 'భరత్ అను నేను' హిందీ వెర్షన్ హక్కులు!

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు 'భరత్ అను నేను' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ సినిమా లక్నో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన ఖైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా హిందీ వెర్షన్ హక్కులు రూ. 16 కోట్లకు అమ్ముడయ్యాయనేది తాజా సమాచారం.

గతంలో కొరటాల .. మహేశ్ బాబు కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' హిట్ కావడం వలన .. ఈ సినిమాకి దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తూ ఉండటం వలన హిందీ వెర్షన్ హక్కులు ఈ స్థాయిలో పలికాయని చెబుతున్నారు. ఇక 'స్పైడర్' సినిమా హిందీ వెర్షన్ హక్కులు రూ. 24 కోట్లకు అమ్ముడైన సంగతి తెలిసిందే. దర్శకుడిగా మురుగదాస్ కి బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఆ సినిమాకి మరింత ధర పలకడం జరిగిందని చెప్పుకుంటున్నారు. 

More Telugu News