Akhil: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  అఖిల్ అక్కినేని నటిస్తున్న రెండో చిత్రానికి 'హలో!' అనే టైటిల్ని ఖరారు చేశారు. విక్రంకుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. దీంతో పాటుగా 'హలో' అంటూ ఈ చిత్రం యూనిట్ ను విష్ చేస్తూ పలువురు సినీ ప్రముఖులు చెప్పిన గ్రీటింగ్స్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.
*  తమిళ హీరో ఆర్య హీరోగా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఓ చిత్రం రూపొందుతోంది. అనూప్ భండారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'రాజరథం' అనే టైటిల్ని నిర్ణయించారు. ఇందులో అవంతిక శెట్టి కథానాయికగా నటిస్తోంది.
*  ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న 'జై లవ కుశ' చిత్రం షూటింగ్ ముమ్మరంగా జరుగుతోంది. మరోపక్క డబ్బింగ్ పనులు కూడా మొదలయ్యాయి. నేటి నుంచి ఎన్టీఆర్ డబ్బింగ్ చెబుతాడట. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 21న విడుదల చేస్తారు.    

More Telugu News