: మార్కెట్లోకి విడుదలైన ‘రెడ్ మీ నోట్ 5ఏ’

షియోమి సంస్థ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ రెడ్ మీ నోట్ 5ఏ ఈ రోజు మార్కెట్లోకి విడుదల అయింది. రేపటి నుంచి చైనాలో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభ్యమవుతోంది. స్టాండర్డ్, హై ఎండ్ లో లభిస్తున్న ఈ ఫోన్ ధరలు వరుసగా రూ.8,645, రూ.11,530 గా సంస్థ ప్రకటించింది. త్వరలో భారత్ లో కూడా ఈ ఫోన్ లభించనుంది.

రెడ్ మీ నోట్ 5ఏ స్టాండర్డ్ ఫీచర్ల విషయానికొస్తే..

5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగ‌న్ 425 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ,16 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ వెనుక కెమెరా, 5 మెగా పిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ వంటి ఫీచర్లు ఉన్నాయి.  

రెడ్ మీ నోట్ 5ఏ హైఎండ్ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..


3080 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 5.5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 435 ప్రాసెస‌ర్‌, 3/4 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ వెనుక కెమెరా, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌,  బ్లూటూత్ 4.2 వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 

More Telugu News