tapsee: హిట్ కొట్టిన దెయ్యం చిత్రాల జాబితాలో 'ఆనందో బ్రహ్మ'

తక్కువ బడ్జెట్ తో రూపొందించే అవకాశం ఉండటం .. భారీ లాభాలు తెచ్చే అవకాశం ఉండటం వలన దెయ్యం సినిమాలు ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. అలాంటి సినిమాల్లో సూపర్ హిట్ అనిపించుకున్నవి తక్కువేనని చెప్పాలి. అయినా దెయ్యం సినిమాల జోరు కొనసాగుతూనే వస్తోంది. అలా వచ్చిందే 'ఆనందో బ్రహ్మ' సినిమా.

తాప్సీ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోందని అంటున్నారు. దెయ్యాలకి భయపడే మనుషుల గురించి కాకుండా .. మనుషులకు భయపడే దెయ్యాలను గురించి చెప్పే వెరైటీ కాన్సెప్ట్ జనాలకి ఎక్కేసింది. ఈ కారణంగానే ఈ సినిమా సక్సెస్ ను సాధించిన దెయ్యాల చిత్రాల జాబితాలోకి చేరిపోయిందని చెప్పుకుంటున్నారు.       

More Telugu News