: అమెరికా దాడి చేస్తే ఉత్తరకొరియా అధ్యక్షుడు ఏం చేస్తారు?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అమెరికాను నాశనం చేస్తానని హెచ్చరికలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా తీవ్రంగా ప్రతిస్పందిస్తే, ఉత్తరకొరియాపై అణుదాడికి తెగబడితే ఆ దేశాధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏం చేస్తారు? ఎలా స్పందిస్తారు? ధైర్యంగా నిలబడతారా? లేక పారిపోతారా? అన్న అనుమానాలకు బ్రిటన్ లో ఉత్తరకొరియా అంబాసిడర్ గా పని చేసిన, కిమ్ నమ్మకస్తుడు థానే యోంగ్ హో సమాధానం చెబుతున్నారు. అమెరికా దాడికి దిగిన మరుక్షణం చైనా పారిపోయేందుకు అధక్షుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

 చైనాలో సురక్షితంగా ఉంటూనే ఉత్తరకొరియాలో సైన్యాన్ని నడిపేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. చైనాలోని యాలు నది సమీపంలో కిమ్ తలదాచుకునే ప్రాంతం ఉందని, ఉత్తరకొరియా నుంచి తప్పించుకునేందుకు కిమ్ దగ్గర రెండు చిన్న విమానాలు సిద్ధంగా ఉంటాయని ఆయన చెప్పారు. వాటిల్లో ఇంధనం నింపి ఉంటుందని అన్నారు. కిమ్ జాంగ్ ఉన్ తప్పించుకోవడమే కాకుండా, తనతో పాటు తన భార్య, లెఫ్టినెంట్ జనరల్ కిమ్ రాక్-జ్యోమ్, క్షిపణుల అధికారి, శాస్త్రవేత్త అయిన కిమ్ జోంగ్-సిక్‌ ను కూడా తీసుకెళ్లనున్నారు. 

More Telugu News