Kajal: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం!

*  'నేనెప్పుడూ గతాన్ని మరచిపోతాను.. భవిష్యత్తు మీదే దృష్టి పెడతాను' అంటోంది ప్రెట్టీ డాల్ కాజల్ అగర్వాల్. 'పరాజయాల గురించి కానీ, విజయాల గురించి కానీ నేనెక్కువగా ఆలోచించను. ఇంకా చెప్పాలంటే నిన్న జరిగిన దానిని వెంటనే మరచిపోతాను. రేపు ఏమిటన్నదే ఆలోచిస్తాను. ఈ ఆలోచనా ధోరణి నాకెంతో ఉపయోగపడుతోంది' అని చెప్పింది.        
*  అజిత్ హీరోగా తమిళంలో రూపొందిన 'వివేగం' చిత్రాన్ని తెలుగులోకి 'వివేకం' పేరుతో డబ్ చేసిన సంగతి విదితమే. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల 24న రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రిలీజ్ పోస్టర్స్ ను విడుదల చేశారు.
*  దుల్ఖర్ సల్మాన్, సాయి పల్లవి జంటగా నటించిన మలయాళ చిత్రం 'కలి'ని తెలుగులోకి 'హేయ్.. పిల్లగాడ' పేరుతో డబ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన లోగో పోస్టర్లను దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేశారు.
*  మంచు మనోజ్ హీరోగా విజయ్ నూతక్కి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఒక్కడు మిగిలాడు' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా కన్నడ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెల 8న దీనిని రిలీజ్ చేస్తారు.   

More Telugu News