: అధికారంలోకి వస్తాం.. మీ సంగతి తేలుస్తాం.. పోలీసులపై దానం ఫైర్

టీఆర్ఎస్ అండచూసుకుని రెచ్చిపోతున్న పోలీసులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందన్న భ్రమలు మానుకోవాలని వారికి హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తాము అధికారంలో వస్తామని, అప్పుడు పోలీసుల సంగతి చూస్తామని హెచ్చరించారు.

ఆదివారం సోమాజీగూడ సర్కిల్‌లో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అండ చూసుకునే వారు అలా వ్యవహరిస్తున్నారని, ఏ ప్రభుత్వమూ శాశ్వతంగా అధికారంలో ఉండదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో తాము తప్పకుండా అధికారంలోకి వస్తామని, పోలీసులు తీరు మార్చుకోకుంటే ఫలితం అనుభవించక తప్పదని హెచ్చరించారు.

More Telugu News