: గూఢచర్యం కేసులో అరెస్టైన పాకిస్థాన్ ఖైదీ నేడు విడుదల

గూఢచర్యం కేసులో జీవిత ఖైదు పూర్తి చేసుకున్న పాకిస్థాన్ ఖైదీ నేడు విడుదల కానున్నాడు. గూఢచర్యానికి పాల్పడుతున్నాడని, సరైన పత్రాలు లేకుండా హైదరాబాదులో ఉన్నాడని చెబుతూ పోలీసులు కేసు నమోదు చేయగా, కేసు విచారించిన న్యాయస్థానం 14 ఏళ్లు కఠినకారాగార శిక్ష విధించింది. దీంతో చంచల్ గూడ జైలులో కొంత కాలం, వైజాగ్ సెంట్రల్ జైలులో మరికొంత కాలం శిక్ష అమలు చేశారు.

2014లో అతనిని వరంగల్ తీసుకొచ్చారు. 2016లో అతని శిక్షా కాలం ముగిసింది. అయితే జైలు నుంచి విడుదల చేసినా, అతను కొన్ని కారణాల రీత్యా పాకిస్థాన్ వెళ్లలేదు. శిక్షాకాలం పూర్తయినా వరంగల్ జైలులోనే ఉన్నాడు. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ నుంచి ఆదేశాలు రావడంతో అతనిని విడుదల చేసి, హైదరాబాదులోని అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. 

More Telugu News