Anjali: సినిమా కబుర్లు... సంక్షిప్త సమాచారం

*  తెలుగు, తమిళ చిత్రాల కథానాయిక అంజలి త్వరలో రజనీకాంత్ నెలకొల్పే రాజకీయ పార్టీలో చేరనుందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఈ చిన్నది తాజాగా స్పందిస్తూ, "తన భవిష్యత్తు గురించి ఇంకా ఆలోచన చేయలేదని, పెళ్లి విషయంలో కానీ, రాజకీయాల విషయంలో కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. అయితే, రాజకీయాలలో చేరడం లేదంటూ స్పష్టమైన సమాధానం మాత్రం చెప్పలేదు.    
*  'పెళ్లి చూపులు' ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'అర్జున్ రెడ్డి' చిత్రానికి సెన్సార్ నుంచి A సర్టిఫికేట్ లభించింది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేస్తున్నారు.
*  నందమూరి కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న 'ఎమ్మెల్యే' చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. నూతన దర్శకుడు ఉపేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.   

More Telugu News