: కుంబ్లేకి, రవిశాస్త్రికి తేడా ఇదే!: కీపర్ వృద్ధిమాన్‌ సాహా

టీమిండియా మాజీ కోచ్‌ అనిల్‌ కుంబ్లే, ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి మధ్య తేడాను టెస్టు కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా తెలిపాడు. శ్రీలంకతో టెస్టు సిరీస్‌ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం స్వదేశం చేరిన సాహా మీడియాతో మాట్లాడుతూ, క్రీజులో దిగిన ప్రతిసారీ 400, 500, 600 ఇలా భారీ స్కోర్లు చేయాలని కుంబ్లే చెప్పేవాడని అన్నాడు. అలాగే ప్రత్యర్థి బౌలర్లు అలసిపోయేంతవరకు బౌలింగ్ చేయనివ్వాలని, అంటే 150, 200 ఓవర్లు విసిరేలా చేయాలని కోరేవాడని అన్నాడు. అయితే ఆయన కోరినట్టు ప్రతిసారి కుదరదు కదా? అని ప్రశ్నించాడు.

ఇక రవిశాస్త్రి కోచింగ్ విషయానికి వస్తే క్రీజులోకి వెళ్లి బంతిని బాదేయమని చెప్తాడని అన్నాడు. ఈ విషయం తప్పిస్తే ఇద్దరూ సానుకూలంగా మాట్లాడుతారని అన్నాడు. కోహ్లీ ఆటగాళ్లతో బాగా కలిసిపోతున్నాడని చెప్పాడు. అలాగే ఆటగాళ్లతో భోజనం చేస్తూ, బయటకు వెళ్తూ జట్టుతో మరింత మమేకం అవుతున్నాడని అన్నాడు. 

More Telugu News