: విద్యార్థినులను కొట్టడానికి, తిట్టడానికి ఎలాంటి అభ్యంతరం లేదని.. తల్లిదండ్రులతో సంతకం చేయించుకురమ్మన్న టీచర్

పాఠ‌శాల‌లో కొంద‌రు విద్యార్థినులకి మార్కులు త‌క్కువ వ‌స్తుండ‌డంతో తమిళనాడు ధర్మపురి జిల్లాలోని కారిమంగళంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఓ టీచ‌ర్‌కి కోపం వ‌చ్చేసింది. దీంతో ఆ బాలిక‌లను తిడుతూ, కొడుతూ చ‌దువు చెప్పాల‌నుకుంది. అయితే, అలా చేస్తే వారి త‌ల్లిదండ్రులు వ‌చ్చి గొడ‌వ చేస్తారేమోన‌ని అనుకుంది. అందుకోసం వారి నుంచి అనుమ‌తి తీసుకోవాలనుకుంది. అనుకున్నట్లుగానే, వారి‌తో ఒక లెట‌రు రాయించింది. ‘11వ తరగతి చదువుతన్న నా కుమార్తె పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకోవడానికి టీచ‌ర్ కొట్టొచ్చు, తిట్టొచ్చు.. ఇందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు’ అని ఆ బాలిక‌ల‌తో రాయించి, అందులో వారి త‌ల్లిదండ్రుల సంత‌కం తీసుకురమ్మ‌ని ఆదేశించింది.

ఆ లెట‌ర్ల‌ను చూసిన విద్యార్థినుల త‌ల్లిదండ్రులు అంద‌రూ త‌దుప‌రి రోజు ఉద‌యాన్నే ఆ స్కూలు వ‌ద్ద‌కు వెళ్లి ఇలా రాయించారేంట‌ని అడిగారు. దీంతో ఆ టీచ‌ర్‌ విద్యార్థినులంతా త‌న కూతుళ్లలాంటి వారేన‌ని, వారిని కొట్టి చదివించడం కోసమే తాను ఇలా అనుమతి అడిగాన‌ని తెలిపింది. చివ‌ర‌కు ఆ త‌ల్లిదండ్రులు ఆ లెట‌ర్ల‌పై సంత‌కం చేయ‌లేద‌ని తెలిసింది. 

More Telugu News