: ఇకపై ‘హార్వర్డ్‌’ సిలబస్‌లో రామాయణ, మహాభారతాలు!

అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివ‌ర్సిటీలో ఇకపై భారతీయ ఇతిహాసాలను బోధించనున్నారు. వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం నుంచి  రామాయ‌ణ‌, మ‌హాభార‌తాలను బోధించ‌నున్నట్లు ‘హార్వ‌ర్డ్’ అధ్యాప‌కురాలు యానీ ఈ మోనియ‌స్ తెలిపారు. ‘హార్వ‌ర్డ్‌’లో ద‌క్షిణాసియా మ‌తాల అధ్యాప‌కురాలిగా ఆమె ప‌నిచేస్తున్నారు.

‘భారతీయ మత గ్రంథాల ద్వారా రచనా సాహిత్యాల బోధన’ అనే అంశాన్ని సిల‌బ‌స్‌లో చేర్చారని, ఆధునిక మ‌త ప‌రిస్థితులకు అనుసంధానించి విద్యార్థులకు బోధిస్తారని చెప్పారు. ద్వేషం, యుద్ధం వల్ల కలిగే నష్టాలను మహాభారతం హుందాగా వివరించిందని, భారతదేశ ప్రేమ కథలలో రామాయణం ఒకటని ఆమె అన్నారు. శతాబ్దానికి పైగా రామాయణ, మహాభారతాలను తాత్విక, లేఖన గ్రంథాలుగానే చాలా మంది పరిశోధకులు అధ్యయనం చేశారని ఆమె అభిప్రాయపడ్డారు. భారతీయ సాహిత్య సంపదను ఎక్కువగా విస్మరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత వీటి గొప్పదనాన్ని అభినందించకుండా ఉండలేరని యానీ ఈ మోనియ‌స్ వ్యాఖ్యానించారు. 

More Telugu News