rana: మొత్తానికి 'నేనే రాజు'ను అనిపించాడు!

ఈ నెల 11వ తేదీన 'నేనే రాజు నేనే మంత్రి' .. 'జయ జానకి నాయక' .. 'లై' సినిమాలు థియేటర్లకి వచ్చాయి. వరుస సెలవులు రావడంతో థియేటర్లన్నీ కళకళ లాడుతూ కనిపించాయి. వసూళ్ల పరంగా చూసుకుంటే ఈ మూడు సినిమాల్లో 'నేనే రాజు నేనే మంత్రి' ముందున్నాడని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే, ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లో 19 కోట్లను వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచింది. రానా లుక్ .. ఆయన నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇక రెండవ స్థానంలో బోయపాటి 'జయ జానకి నాయక' నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కావడం ఈ సినిమాకి కలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వారం రోజుల్లో 15 కోట్లను రాబట్టింది. ఇక ఈ రెండు సినిమాలకన్నా ఎక్కువ బడ్జెట్ తో రూపొందినా, మూడవ స్థానంతో 'లై' సరిపెట్టుకోవాల్సి వచ్చింది.      

More Telugu News