: స్పెయిన్ ఉగ్రదాడి, 'ఇన్ఫోసిస్' సీఈఓ రాజీనామా నేపథ్యంలో... నష్టాలలో స్టాక్‌మార్కెట్లు!

ఈ రోజు స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 271 పాయింట్ల నష్టంతో 31,525 పాయింట్ల వద్ద, నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 9,837 పాయింట్ల వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో అల్ట్రాటెక్ సిమెంట్, భారత్ పెట్రోలియం, ఐషర్ మోటార్స్,భారతీ ఇన్ ఫ్రాటెల్,  హిందూస్థాన్ యునీ లివర్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. జీ ఎంటర్ టైన్ మెంట్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, వేదాంత లిమిటెట్ సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా, ‘ఇన్ఫోసిస్’ సీఈవో విశాల్ సిక్కా వైదొలగడం, స్పెయిన్ ఉగ్రదాడి వంటి సంఘటనల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి.

More Telugu News