: ఇన్ఫోసిస్ పై 'సిక్కా' ఎఫెక్ట్... గంటలో రూ. 16 వేల కోట్లు గంగలో!

ఇండియాలో రెండో అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ నుంచి విశాల్ సిక్కా పక్కకు తప్పుకున్నారన్న వార్త, ఆ సంస్థ మార్కెట్ కాపిటలైజేషన్ ను భారీగా పడదోసింది. ఈ ఉదయం గంట వ్యవధిలో ఇన్ఫీ కాపిటలైజేషన్ లో రూ. 16 వేల కోట్లు గంగలో కలసిపోయాయి. సంస్థ ఈక్విటీ 7 శాతానికి పైగా పతనం కాగా, జూన్ 30 నాటికి రూ. 2.10 లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ ఇప్పుడు భారీగా తగ్గింది. ఈ ఉదయం 9 గంటల సమయంలో ట్రేడింగ్ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభమవుతుందనగా, బీఎస్ఈకి పంపిన ఫైలింగ్ లో సిక్కా రాజీనామా విషయాన్ని, దాన్ని ఆమోదిస్తున్నామన్న సమాచారాన్ని కంపెనీ చేరవేసింది. ఆ వెంటనే ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ 5 శాతం నష్టంతో ట్రేడ్ అయి, మరింతగా దిగజారింది.

More Telugu News