: నియంత్రణ రేఖ వెంబడి 100 బంకర్ల నిర్మాణాన్ని ప్రారంభించిన కశ్మీర్ ప్రభుత్వం.. పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలే కారణం!

రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న గ్రామాల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం బంకర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో పాకిస్థాన్ వైపు నుంచి కాల్పుల ఉల్లంఘనల ఘటనలు పెరగడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నౌషేరా సెక్టార్‌లో వంద బంకర్ల నిర్మాణాన్ని ప్రారంభించినట్టు రాజౌరీ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ షాహిద్ ఇక్బాల్ చౌధరీ తెలిపారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ బంకర్లలో 1200-1500 మంది తలదాచుకోవచ్చని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో మొత్తం 6121 బంకర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించగా తొలుత పైలట్ ప్రాజెక్టు కింద వంద బంకర్ల నిర్మాణాన్ని చేపట్టింది.

More Telugu News