: మీరు మీరు మాట్లాడి తేల్చుకోండి: భారత్, చైనాలకు అమెరికా సలహా

డోక్లామ్ ప్రాంతంలోని ట్రై జంక్షన్ ప్రాంతంలో ఇండియా, చైనాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని, అందుకు చర్చలు ఒక్కటే మార్గమని అమెరికా సలహా ఇచ్చింది. "రెండు వర్గాలనూ కూర్చుని చర్చలు జరపాలని మాత్రమే మేము చెప్పగలము. అంతకన్నా ఇంకేమీ చేయలేము" అని అమెరికా ప్రతినిధి హెదర్ నౌరెట్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మధ్య ఈ తరహా ఉద్రిక్త పరిస్థితి రెండు దేశాలకూ మంచిది కాదని ఆయన అన్నారు.

కాగా, గత జూన్ లో డోక్లామ్ ప్రాంతంలో డ్రాగన్ సైన్యం రహదారి నిర్మాణానికి పూనుకోగా, భారత్ సైన్యం అడ్డుకున్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో పరిస్థితి మారిపోయింది. ఈ ప్రాంతం తమదంటే తమదని రెండు దేశాలూ వాదనలకు దిగుతూ, ఇరువైపులా తమ తమ సైన్యాలను మోహరించాయి. ట్రై జంక్షన్ పాయింట్లను చైనా అతిక్రమిస్తోందని భారత్ ఆరోపిస్తుండగా, ఈ ప్రాంతం తమదేనని నెహ్రూ హయాంలోనే రాతకోతలు జరిగాయని వాదిస్తోంది.

More Telugu News